హీరో అడివి శేష్ వైవిధ్యమైన సినిమాలు చేయడంలో ముందుంటాడు. అందరి హీరోల్లా కమర్షియల్ సినిమాలు కాకుండా దేశభక్తి.. సస్పెన్స్ థ్రిలర్ చిత్రాలు చేస్తుంటాడు. శేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘డకాయిట్’. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్. ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. తొలుత ఈ సినిమాలో శృతి హాసన్‌ని హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ, అనుకోకుండా ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆ తర్వాత మృణాల్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేద్దామని భావించారు.
కానీ, అనుకోని కారణాల వల్లా ఆ తేదీకి సినిమా రిలీజ్ చేయడం కుదరకపోవడంతో కొత్త విడుదల తేదని ప్రకటించారు. వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఇందుకు సంబంధించి కొత్త పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ‘ఈసారి మామూలుగా ఉండదు.. వెనక్కి తిరిగి చూసేది లేదు’ అని క్యాప్షన్ పెట్టారు.
అడవి శేష్ నటించిన క్షణం, గూఢచారి సహా పలు సినిమాలకు కెమెరామెన్‌గా పని చేసిన షానీల్ డియో ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమాను సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.