హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఓ వ్యక్తి సెల్ టవర్ చేసి హల్‌చల్ చేశాడు. ఓ గంటపాటు సెల్ టవర్ మీద అతను కలకలం సృష్టించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని కాపాడేందుకు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. అతన్ని కిందకు దింపే ప్రయత్నంలో పోలీసులు 108 అంబులెన్స్ సర్వీస్‌ను, డాక్టర్లను అక్కడ అందుబాటులో ఉంచారు. పోలీసు సిబ్బందిలో ఒకరు పైకి ఎక్కి ఆ వ్యక్తిని కిందకు దింపే ప్రయత్నం చేశారు.
అతడిని కిందకు దింపే ప్రయత్నం చేయగా.. చేయి విదిల్చుకొని అతడు కిందకు దూకేశాడు. దూకే క్రమంలో టవర్‌కు ఉన్న కడ్డీలు తగిలి బురదలో పడ్డాడు. దాంతో అతనికి తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడు బీహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అతడు సెల్ టవర్ ఎందుకు ఎక్కాడనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.