హైదరాబాద్: బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు బండారాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితనే బయట పెడుతోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ ను హరీష్ రావు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాటాడుతూ..సవాలు విసిరితే హరీష్ రావు తోక ముడిచారని విమర్శించారు. కెబినెట్లో వ్యక్తిగత పంచాయితీలు జరగలేదని తెలియజేశారు. హరీష్ రావు చర్చకు వస్తే వెళ్లడానికి సిద్ధం అని హరీష్ రావు ఏం అడిగినా సమాధానం చెప్పేందుకు సిద్ధం అని అడ్లూరి సవాల్ విసిరారు. చర్చకు రమ్మంటే మాజీ ఎమ్మెల్యేలను పంపుతానని అంటారా? అని మండిపడ్డారు. హరీష్ రావు మాట్లాడిన మాటలు నిరూపించగలరా? అని ప్రశ్నించారు. ప్రగతి భవన్ కు వచ్చిన హోంమంత్రిని.. అపాయింట్ మెంట్ లేదని చెప్పింది కెసిఆర్ అని అడ్లూరి లక్ష్మణ్ ధ్వజమెత్తారు.