లండన్: బ్రిటన్‌లో రోజు రోజుకు భారతీయులపై దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. భారతీయ యువతిపై శ్వేత జాతీయుడు అత్యాచారం చేయడంతో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వెస్ట్ మిడ్‌ల్యాండ్‌లో సిక్కు యువతి నివసిస్తోంది. నిందితుడు యువతి ఇంటి డోర్‌ను పగులగొట్టి ఆమెపై అత్యాచారం చేశాడు. వెంటనే బాధితురాలి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సిసి కెమెరాల ఆధారంగా నిందితుడు శ్వేత జాతీయుడిగా గుర్తించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని, అతి త్వరలో అరెస్టు చేస్తామని స్థానిక పోలీస్ అధికారి పేర్కొన్నారు. నెల రోజుల క్రితం కూడా ఓల్డ్‌బరీ ప్రాంతంలో ఓ సిక్కు యువతిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. భారతీయులపై అత్యాచారాలు జరగడంతో యుకె రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజకీయంగా దుమారం కూడా రేపుతున్నాయి. బాధితురాలు పంజాబీ యువతి అని సిక్కు పెడరేషన్ యుకె వెల్లడించింది.