‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వ్క్రూ బన్నీ నుంచి వచ్చిన అన్ని చిత్రాల కంటే.. ఈ సినిమా చాలా భిన్నంగా ఉండబోతుందని.. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో ఓ గర్వ కార్ణంగా ఉంటుంద్ని చిత్రయూనిట్ చెబుతోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో అల్లు అర్జున్ లుక్, యాక్షన్ ది బెస్ట్ అంటూ చెబుతున్నారు.కాగా ఈ సినిమాలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తోంది. ఇక బన్నీ కోసం అట్లీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడని తెలుస్తోంది. కాగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు ఈ సినిమా కోసం అట్లీ ప్రత్యేకంగా గెస్ట్ రోల్స్ ను డిజైన్ చేస్తున్నాడట. మరి ఆ గెస్ట్ రోల్స్ కోసం అట్లీ ఎవర్ని సంప్రదిస్తాడో చూడాలి. మొత్తం మీద అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించబోతోందని ఇండస్ట్రీ టాక్.