భోపాల్: గడ్డియంత్రంతో పామును మూడు ముక్కలు కట్ చేయడంతో పాము తల యువతిని కరవడంతో ఆమె మృతి చెందింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం మురైనా జిల్లా సభల్‌గఢ్ ప్రాంతంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నౌదండ గ్రామంలో భర్తి కుశ్వాహా(18) అనే యువతి వ్యవసాయం పనులలో కుటుంబ సభ్యులకు చేదోడువాదోడుగా ఉంటుంది. యంత్రంతో గడ్డిని భర్తి కట్ చేస్తుంది. గడి మధ్యలో పాము ఉన్న విషయం ఆమె గమనించకపోవడంతో పాము మూడు ముక్కలు చేసింది. పాము తలభాగం భర్తిని కాటువేయడంతో నోట్లో నుంచి నురగలు వచ్చాయి. వెంటనే ఆమెను నాటు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిందని వెల్లడించారు.