హైదరాబాద్: రాష్ట్రంలో వర్ష సూచనల దృష్ట్యా పంటల కొనుగోళ్లపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సిఎం ఆదేశాలతో సాయంత్రం కలెక్టర్లతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగొళ్లపై అప్రమత్తంగా ఉండాలని, రైతులకు నష్టం జరగకుండా, ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశం ఇచ్చారు.