సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. ఓ క్యాచ్‌ని అందుకొనే క్రమంలో శ్రేయస్ పక్కటెముకల వద్ద ఫ్రాక్చర్ అయింది. దీంతో అతన్ని వెంటనే మైదానం నుంచి తరలించారు. రెండో ఇన్నింగ్స్‌లో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ప్రస్తుతం శ్రేయస్‌కి చికిత్స జరుగుతోంది. దీనిపై తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.
‘‘శ్రేయస్ అయ్యర్ ప్లీహానికి గాయమైంది. వైద్యబృందం చేసిన టెస్ట్‌ల రిపోర్టులు వచ్చాయి. అంతర్గతంగా రక్తస్రావం జరిగినట్లు రిపోర్టుల్లో తేలింది. దీంతో అతడిని ఐసియులో చికిత్స అందిస్తున్నాం. కనీసం రెండు రోజుల నుంచి ఏడు రోజుల వరకూ అబ్జర్వేషన్‌లో ఉంటాడు. బ్లీడింగ్ ఆగిపోవడం, ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటే తుదుపరి నిర్ణయం తీసుకుంటాం. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా టైంకి ఆస్పత్రికి తీసుకొచ్చారు. లేకపోతే ప్రాణాల మీదకు వచ్చేది. ప్రస్తుతం శ్రేయస్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. శ్రేయస్ దృఢమైన వ్యక్తి.. త్వరలోనే కోలుకుంటాడు’’ అని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.