ఇటీవలే వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ పూర్తి చేసుకున్న టీం ఇండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈ సిరీస్ తర్వాత భారత్ సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఐదు టి-20లలో తలపడనుంది. ఈ ప్రతిష్టాత్మక పోరులో భారత్‌తో తలపడే జట్టును సఫారీ క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. కెప్టెన్ టెంబా బవూమా గాయం నుంచి కోలుకోవడంతో సౌతాఫ్రికా అతడి సారథ్యంలో ఈ సిరీస్ బరిలోకి దిగనుంది.
తాజాగా సౌతాఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా పాకిస్థాన్‌తో తలపడింది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన సఫారీలు పాక్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత జరిగిన రెండో టెస్ట్‌లో విజయం సాధించి.. సిరీస్‌ని 1-1గా సమం చేసుకున్నారు. ఇప్పుడు భారత్‌తో తలపడే జట్టులో స్వల్ప మార్పులు చేశారు. ఇక ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ సిరీస్ కోసం తలపడే భారత జట్టును బిసిసిఐ ప్రకటించే అవకాశం ఉంది.
టెస్టుల్లో భారత్‌తో తలపడే సౌతాఫ్రికా జట్టు ఇదే:
టెంబా బవుమా (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, రియాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైలీ వెరెన్నె, డెవాల్డ్ బ్రెవిస్, జుబేర్ హంజా, టోనీ డీ జోర్జి, కార్బిన్ బాష్, వియాన్ ముల్దర్, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, సెనురాన్ ముత్తుస్వామి, కగిసో రబడ, సైమన్ హార్మర్.