కోకొరో అనే క్లాసిక్ జపనీస్ నవలను సొసెకి నట్సుమే 1914లో రాసాడు. ఈ నవలను శ్రీనివాస చక్రవర్తి అనువదించారు. పుస్తకాన్ని నవంబర్ 1957లో తొలిసారిగా దక్షిణ భాషా పుస్తక సంస్థ సహకారంతో ఆదర్శ గ్రంథమండలి వారు ముద్రించారు. ఇప్పుడు అనిల్ బత్తుల పబ్లికేషన్స్ తరుపున రెండవ పుస్తకంగా మోషే డయాన్ గీసిన బొమ్మతో సరికొత్త కవర్ పేజీతో వైవిధ్యంగా డిజైన్ చేసి, ఈతరం పాఠకుల ముందుకు అతి త్వరలో రాబోతుంది. ఈ పుస్తకం కవర్ పేజీ మీద ఉన్న టైటిల్ కాలిగ్రఫీ రాసింది బాపు.
ఇక ఈ నవల కథాంశం విషయానికి వస్తే సెన్సే అనే యువకుడి జీవితంలోని ప్రేమ, స్నేహాల దాగుడుమూతల్ని మనసుతో, కంటితో మనం చూడవచ్చు. తండ్రి మరణాంతరం పినతండ్రి తన ఆస్తినంతా కాజేస్తే, మనుషుల మీద విశ్వాసాన్ని కోల్పోతాడు. వివాహం చేసుకోవాలనుకున్న యువతి ద్రోహం చేస్తుంది. స్నేహితుడు ఆత్మహత్య చేసుకుంటాడు. మరి సెన్సే జీవితం చివరికి ఏమైంది? ఈ నవల ఆధారంగా ఖోన్ ఈచికవ దర్శకత్వంలో 1955లో ’KOKORO’ అనే జపనీస్ సినిమా వచ్చింది. ఈ పుస్తకం పేజీలు: 120, ధర: 120. ప్రచురణ: అనిల్ బత్తుల పబ్లికేషన్స్. పుస్తకం విడుదల అయిన తరువాత నవోదయ బుక్ హౌస్ లోనూ, అమెజాన్ లోనూ లభిస్తుంది.
– అనిల్ బత్తుల పబ్లికేషన్స్