రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘కాంతార: ఛాప్టర్ 1’. అక్టోబర్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమా త్వరలోనే ఒటిటిలో సందడి చేయనుంది. అక్టోబర్ 31వ తేదీ నుంచి ఈ సినిమా ప్రముఖ ఒటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఒటిటి సంస్థ అధికారికంగా ప్రకటించింది.
2022 విడుదలైన ‘కాంతార’ సినిమాకు ఈ సినిమా ప్రీక్వెల్‌గా తెరకెక్కింది. 8వ శతాబ్దంలో కదంబుల రాజ్య పాలనలో జరిగే కథ ఇది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా.. గుల్షన్ దేవయ్య తదితరులు ఈ ప్రీక్వెల్‌లో కొత్తగా కనిపించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ సినిమాల జాబితాలో ఈ సినిమా 13వ స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ఈ నెల 31న ఇంగ్లీష్‌లో రిలీజ్ కానుంది.