విష్ణు విశాల్ నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’, ప్రవీణ్ కె దర్శకత్వంలో విష్ణు విశాల్ స్టూడియోజ్, శుభ్రా, ఆర్యన్ రమేష్ సం యుక్తంగా నిర్మిస్తున్నారు. టీజర్, ట్రైలర్ సినిమా పై మంచి అంచనాలను సృష్టించాయి. ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మేకర్స్ పరిచయమే సాంగ్ రిలీజ్ చేశారు. జిబ్రాన్ ఈ సాంగ్ ని బ్యూటీఫుల్ లవ్ మెలోడీగా కంపోజ్ చేశారు. సామ్రాట్ అందించిన లిరిక్స్ కట్టిపడేశాయి. ఈ సాం గ్ లో లీడ్ పెయిర్ జర్నీ హత్తుకునేలా వుంది. సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మా నస చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్, అభిషేక్ జోసెఫ్ జార్జ్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.విష్ణు విశాల్ ఎఫ్ ఐ ఆర్ చిత్రానికి దర్శకత్వం వహించిన మను ఆనంద్ ఈ చిత్రానికి సహ రచయిత గా పనిచేశారు. ’ఆర్యన్’ అక్టోబర్ 31న విడుదల కానుంది. ఏపీ, తెలంగాణల్లో ఈ చిత్రాన్ని సుధాకర్‌రెడ్డి (శ్రేష్ట్ మూవీస్) గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.