అమరావతి: విజయవాడ నుంచి కోదాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పొగలు వచ్చాయి. వెంటనే బస్సును నందిగామ వద్ద రోడ్డు పక్కన డ్రైవర్ ఆపాడు. బస్సులో నుంచి ప్రయాణికులను డ్రైవర్ కిందకు దించేశాడు. పొగలు రావడంతో 15 మంది ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. మరో బస్సులో ప్రయాణికులను ఆర్టీసీ సిబ్బంది పంపారు. షార్ట్ సర్క్యూట్ తోనే పొగలు వచ్చినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున బస్సులో ప్రమాదంలో 19 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే.