హైదరాబాద్: తెలంగాణలో లోపాకారిగా కాంగ్రెస్, బిజెపి కలిసి పనిచేస్తున్నాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటినీ కాంగ్రెస్, బిజెపి బీ టీం అంటోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్లుగా అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. బిజెపితో కలిసి పనిచేస్తున్న సిఎం రేవంత్ రెడ్డి గురించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి అని కెటిఆర్ ప్రశ్నించారు. పదేళ్ల బిఆర్ఎస్ ప్రగతి వర్సెస్ రెండేళ్ల కాంగ్రెస్ మోసాలు చూసి ఓటేయ్యండి అని సూచించారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం సిఎం తో పాటు మంత్రులకు లేదు అని కెటిఆర్ పేర్కొన్నారు.