హైదరాబాద్: నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్ చేస్తామని ఉన్నత విద్యాసంస్థ సమాఖ్య ప్రకటించింది. రూ.900 కోట్ల బకాయిలు ఇవ్వకుంటే మళ్లీ బంద్ తప్పదని సమాఖ్య హెచ్చరించింది. రూ.1,200 కోట్లకు రూ.300 కోట్లే ఇచ్చారని సమాఖ్య ఛైర్మన రమేశ్ తెలిపారు. నవంబర్ 1 లోపు మిగిలిన రూ.900 కోట్లు ఇవ్వాలని రమేశ్ డిమాండ్ చేశారు. మిగిలిన బకాయిలపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు. ఫీజు బకాయిలు చెల్లించకుంటే కాలేజీలు నడపలేమని రమేశ్ అన్నారు. మంత్రులు తమకు సహకరించడం లేదని పేర్కొన్నారు. బకాయిలు అడిగినప్పుడే మాపై విచారణలు చేస్తున్నారని ఆరోపించారు. భయపెడితే ఊరుకోమని, ఒక్క పోలీసును కూడా కాలేజీల్లోకి రానివ్వమని హెచ్చరించారు.