హైదరాబాద్: చేతికి వచ్చిన పంటను ధ్వంసం చేయడం సరికాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రకాష్ కుటుంబానికి పంట నష్ట పరిహారాన్ని కలెక్టర్ వెంటనే చెల్లించాలని అన్నారు. రెండో రోజు జనం బాటలో కవిత పర్యటించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో పోడు భూముల బాధిత రైతు ప్రకాష్ కుటుంబాన్నికవిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబానికి పంట నష్ట పరిహారాన్ని కలెక్టర్ వెంటనే చెల్లించాలని, బాధితులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని కోరారు. మంచిప్ప రిజర్వాయర్ ముంపు తగ్గిస్తామని చెప్పిన సిఎం రేవంత్ రెడ్డి ముంపు గ్రామాల పోడు భూములకు ఎందుకు పట్టాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గిరిజన రైతులను ఫారెస్ట్ అధికారులు వేధించడం మానుకోవాలి అని కవిత విజ్ఞప్తి చేశారు.