అమరావతి: నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వద్ద బస్సులో పొగలు వ్యాపించాయి. బెంగుళూరు వెళ్తున్న సాయి సింధు ఓల్వో బస్సులో ఆకస్మాత్తుగా పొగలు దట్టంగా అలుముకున్నాయి. డ్రైవర్ బస్సును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. మరో ట్రావెల్స్ బస్సును యాజమాన్యం ఏర్పాటు చేసింది. స్థానికులు సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పొగలు ఆర్పే ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కర్నూలు సమీపంలో ఒక బస్సులో అగ్నిప్రమాదం జరిగిన సంఘటన మరవకుండానే ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.