నవీ ముంబై: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్‌లో భారత్ సెమీ ఫైనల్‌కు చేరింది. ఈ నామమాత్రపు మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌కి వర్షం ఆటంకం కలిగించింది. ఈ మ్యాచ్‌లో భారత్ ప్రయోగాలు చేసే ప్రయత్నం చేస్తుంది. వికెట్ కీపర్ రిచా ఘోష్‌కి విశ్రాంతి ఇచ్చి ఆమె స్థానంలో ఉమ ఛైత్రీని జట్టులోకి తీసుకున్నారు. ఉమకు ఇది తొలి అంతర్జాతీయ వన్డే కావడం విశేషం. స్మృతి ఆమెకు వన్డే క్యాప్‌ను అందించింది. మరి వర్షం తగ్గాక మ్యాచ్‌ని యథావిధిగా కొనసాగిస్తారా.. లేక డిఎల్‌ఎస్ విధానంలో ఓవర్లు కుదిస్తారో తెలియాలంటే.. ఇంకాస్త సమయం ఎదురుచూడాల్సిందే.