హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కెపిహెచ్‌బి కాలనీ సమీపంలోని జెఎన్‌టియు వంతెనపై కారు బోల్తాపడింది. కారు అతివేగంతో డివైడర్, బైక్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోద చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూడాన్ చెందిన ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు కారులో ఉన్నట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే సూడాన్ దేశస్థులు క్యాబ్ బుక్ చేసుకొని ఘటనా స్థలం నుంచి పారిపోయారు. ప్రమాదానికి కారణమైన కారు అద్దెకు తీసుకున్నారా? లేక ఎవరైనా ఇచ్చారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.