హైదరాబాద్: బిఆర్ఎస్ లో అన్ని బాధ్యతలకు తాను రాజీనామా చేసి మళ్లీ జనం ముందుకు వచ్చానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. సామాజిక తెలంగాణ కోసమే జనం బాట నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జనం బాటకు పలువురు అండగా ఉన్నారని తెలియజేశారు. జనంబాట చేపట్టిన తనపై నిజామాబాద్ మాజీ ఎంపి అరవింద్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కవిత విమర్శించారు. అతని ‘చిట్టా’ త్వరలో బయటపెడతానని హెచ్చరించారు. ఎంపి అర్వింద్ రాజీనామా చేస్తే బిసి బిల్లు అదే వస్తుందని కవిత పేర్కొన్నారు.