హైదరాబాద్: చాదర్ఘాట్ కాల్పుల కేసులో విచారణ కొనసాగుతుంది. మరోసారి విక్టోరియా గ్రౌండ్స్లో క్లూస్ టీమ్ దర్యాప్తులో చేస్తోంది. చాదర్‌ఘాట్ విక్టోరియా గ్రౌండ్ కాల్పుల కేసు ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలను పొందుపరిచారు. కాల్పుల ఘటనపై సుల్తాన్ బజార్ పోలీసులకు డిసిపి చైతన్య ఫిర్యాదు చేశారు. ఒమర్తో ఉన్న మరో నిందితుడు అన్సారీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం సాయంత్రం సౌత్ ఈస్ట్ డిసిపి చైతన్య గన్ మెన్ పై దాడికి యత్నించిన విషయం తెలిసిందే. దీంతో చైన్ స్నాచర్పై డిసిపి కాల్పులు జరిపారు. వెంటనే రౌడీ షీటర్ ఒమర్ ను ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఒమర్కు వైద్య పరీక్షలు పూర్తికాగానే ఇవాళ ఒమర్కు వైద్యులు ఆపరేషన్ నిర్వహించనున్నారు.
కోఠి వద్ద ఓ వ్యక్తి మొబైల్ స్నాచింగ్ చేసి ఆటోలో పారిపోయేందుకు ముగ్గురు నిందితులు ప్రయత్నించారు. ఆటోలో మొత్తం ముగ్గురు పారిపోతుండగా ఒమర్ ను పట్టుకునేందుకు తన గన్ మెన్ మూర్తి ప్రయత్నించాడని డిసిపి తెలిపాడు. ఒమర్ నెట్టడంతో తాము కిందపడిపోయామని, గన్ మెన్ ను కత్తితో పొడిచి చంపేందుకు ఒమర్ ప్రయత్నించడంతో తాను కాల్పులు జరిపానని వివరణ ఇచ్చాడు. ఈ సమయంలో మిగతా ఇద్దరు దొంగలు ఆటోలో పారిపోయారన్నారు. తన గన్ మెన్ ను కాపాడేందుకు కాల్పులు జరిపానని డిసిపి వెల్లడించారు.