హైదరాబాద్: కార్మిక సంఘం ఎన్నికల్లో బిజెపిపై బిఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. కార్మిక సంఘం ఎన్నికల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజయం సాధించారు. దీంతో బిఆర్ఎస్ శ్రేణుల సంబరాలు చేసుకున్నాయి. కార్మిక సంఘం ఎన్నికల్లో బిజెపి ఎంపి రఘునందన్ రావుపై బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజయ ఢంకా మోగించారు. బాలానగర్ ఎంటిఎఆర్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలోని కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నికలో భారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గెలుపొందారు.