నాకు పర్ఫెక్ట్ డ్రైవింగ్ వస్తుంది. ఇన్ని సంవత్సరాల నా డ్రైవింగ్ సర్వీసులో ఎప్పుడు కూడా ఎలాంటి చిన్న రోడ్డు ప్రమాదం చేయలేదు అనే ధీమాతో రోడ్లపై వాహనాల సీనియర్ డ్రైవర్లు అనుకోవడం మనకు తెలిసిందే. మనకు డ్రైవింగ్ సరిగానే వస్తుంది కానీ ఎదురుగా వచ్చే వాహనం డ్రైవర్ సరిగా లేకుంటే అది మనకు ప్రమాదమే. ఈ చిన్న విషయాన్ని గమనిస్తే రోడ్డు ప్రమాదాలు కొన్ని తగ్గుతాయి. వేగం తగ్గిస్తే ఎదుటి వారి నుండి మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఎలిమెంట్లు లేకుండా, అధిక లోడుతో, అతి వేగంతో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలలో కనురెప్పపాటులో ప్రాణాలు వదులుతూ లక్షలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలను అనుకోకుండా జరిగే ప్రమాదాలు కాబట్టి యాక్సిడెంట్ అంటాం. రోడ్డు ప్రమాదాల తరహాలోనే గుండెపోటు ప్రమాదాలు.. నాకు ఎటువంటి చెడు అలవాట్లు అంటే మద్యపానం, పానం వంటివి ఏవీ లేవని, నేను రోజు ఉదయం జాగింగ్‌కు వెళ్తానని లేదా వ్యవసాయం పనిలో ఎప్పుడు పని చేస్తూ ఉంటాను అని, నేను మెకానిక్‌ను, హార్డ్ వర్కర్ ను, నేను ఎప్పుడూ ఏదో పని చేస్తుంటాను అంటూ ఇలా కొంత మంది ఏదో ఒక శరీరం దృఢపడే పనులు చేస్తూ ఉంటారు.
ఈ పనులు చేసేవారు శరీరం దృఢపడడంతో పాటు అవయవాలు కూడా బాగానే ఉన్నాయని, నాకు ఎలాంటి అనారోగ్య పరిస్థితులు రావని, నా ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటున్నానని ధీమాతో బీమా వ్యక్తం చేసేవారు అధిక శాతం. పొద్దంతా పనిచేసి విశ్రాంతికి మందు తాగితేముంది.. పొద్దంతా పనులు చేస్తాం, వ్యవసాయ పనులు చేస్తాం, భవన నిర్మాణ పనులు చేస్తాం, బాడీ విశ్రాంతి ఉపశమనం కోసం కాయకష్టం చేసి కొద్దిగా మందు తాగితే ఏమవుతుంది? మేం చేసేది రెక్కలుముక్కలు చేసుకుని చేసే కష్టమే కదా మా శరీరానికి మందు తాగితే ఏమవుతుంది అన్న ధైర్యంతో సుమారు 70 శాతం మంది పట్టణ, పల్లెటూర్లలో వైన్స్ పర్మిట్ రూములలో పట్టనంత మంది రోజు వారు చేసిన కష్టంలో సగం మద్యం ఖర్చుకే పోతున్నాయి. వారు తాగే మద్యం నాణ్యమైన మద్యం కూడా కాదు. పక్క రాష్ట్రాల నుండి ప్రభుత్వాల అనుమతులు లేని చీప్ లిక్కర్, చౌకబారు మద్యంను సేవించే వారే ఈ కాయం కష్టం చేసే కూలీనాలీ జనాలు. ఈ వ్యసనం కొన్ని సంవత్సరాల తర్వాత నేరుగా ఊపిరితిత్తులు గాని, కిడ్నీలకు గాని, అన్నిటి కంటే ముఖ్యంగా గుండెకు కచ్చితంగా ఆటంకం కలిగిస్తుంది. అనారోగ్య ప్రమాదం ఏర్పడుతుంది.
బీడీ, సిగరెట్ అలవాటు ఉన్న వారి సంగతి ఇక చెప్పనవసరం లేదు. పట్టణ ప్రాంతాలలో ప్రస్తుతం విద్యావంతుల కొంతమంది వైద్య రంగం, కొన్ని రంగాలలో పని చేసే వారికి ఈ అలవాట్లు లేకపోవచ్చు. కానీ, ఇతర కూలీనాలీ పని చేసే వారికి మాత్రం తప్పనిసరిగా ఈ ధూమపానం అలవాటు ఉంటుంది. పల్లెటూర్లలో చెప్పనవసరం లేదు, ధూమపానం అలవాటు ఉన్నవారు 70 శాతం పైగానే ఉంటారు. ఇంతకు ముందు పొగాకును వీక్లీ మార్కెట్లలో కిలోల కొద్దీ కొనుగోలు చేసి చుట్టలు తాగేవారు. ఇప్పటికీ తంబాకు చుట్టా తాగే వారు పల్లెటూర్లలో ఇంకా ఉన్నారు. ఇక ధూమపానంలో లేటెస్ట్‌గా సిగరెట్లలో రోజుకో మోడల్, రోజుకు ఫ్యాషన్ లైట్ సిగరెట్లు, స్మార్ట్ సిగరెట్లు అంటూ రకరకాలుగా, పుట్ట గొడుగుల్లా సిగరెట్ కంపెనీలు పుట్టుకొస్తూ కాలేజీలు, పాఠశాలలకు వెళ్లే యువకులను ఆకర్షించే విధంగా సిగిరెట్ పాకెట్లు వస్తున్నాయి. వీటిని నిషేధించే నాథుడే లేడు. కాలేజీకి వెళ్లే విద్యార్థి కూడా సిగరెట్లు తాగుతున్నాడు అంటే ధూమపానం ఏ స్థాయికి వెళ్లిందో ఆలోచించాలి.
వెనుకటి నుండి పనులు చేస్తూ మధ్యలో విశ్రాంతికి దిగినప్పుడు ఒక బీడీ తాగే పల్లెటూరి వ్యక్తి ఇప్పుడు బీడీ కట్టలు కట్టలు తాగుతూ కొద్దిగా పదిమంది ఉన్నచోట హోటల్లో చాయ్ తాగి సిగరెట్ కూడా అలవాటు పడుతూ పల్లెటూర్లలో చెప్పలేని విధంగా ధూమపానం నూటికి నూరు శాతం పెరిగిపోయింది. ఇలా అధిక ఈ ధూమపానం వల్ల శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర అవయవాలతో పాటు ప్రధానంగా గుండెకు రక్తప్రసరణ చేసే రక్తనాళాలను మూసివేసే ప్రమాదం ఉందని డాక్టర్లు గట్టిగా నొప్పి చెపుతున్నారు. చెడు అలవాట్లు లేని వారు, ఆరోగ్యం పట్ల అప్రమత్తం అనేవారు మాకు ఎటువంటి ధూమపానం, వంటి చెడు అలవాట్లు లేవు, మేము చిన్న చిన్న చిట్కాలతో మా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ అప్రమత్తంగా ఉంటున్నాం. మాకు గుండెపోటు వంటి రోగాలు దరికి రావని ధీమాతో ప్రధానంగా పల్లెటూర్లలో జీవిస్తున్న వారు అధిక శాతం ఉన్నారు.
చెడు అలవాట్లు లేవు కానీ శరీరంలో కొలెస్ట్రాల్ (చెడు కొవ్వు) పెంచే పదార్థాలను భుజిస్తూనే ఉన్నారు, మాంసాహారులైతే రకరకాల మాంసాహార బిర్యానీలకు అలవాటు పడి అదే పనిగా బొక్కలతో తయారైన మంచినూనెతో చేసిన బిరియానీలు తింటూ శరీరంలో కొవ్వును పెంచుకుంటున్నారు. శాకాహారులకు, మరి మాంసాహార వ్యక్తులకు శరీరంలో మాంసంతో కొవ్వు పెరుగుతుందని అనుకుంటే మరి అసలు మాంసం అలవాటు లేని శాకాహారులకు శరీరంలో కొవ్వు పెరగడంపై కొంత మంది ఆశ్చర్యపోతున్నారు. కొవ్వు కేవలం మాంసంలోనే ఉండదు. మాంసకృత్తులు ఉండే శాకాహారాలలో కూడా మాంసకృతులతో శరీరంలోని కొవ్వు పెరిగి గుండెపోటు ప్రమాదాల అంచులకు వెళ్తున్నారు. ఎన్ని చెడు అలవాట్లు ఉన్నా, చెడు అలవాట్లు లేకున్నా శరీరం, అవయవాలు ఆరోగ్యాల పట్ల అశ్రద్ధ వహిస్తే మృత్యువాత పడకతప్పవని డాక్టర్లు చెబుతున్నారు.
ఎటు తిరిగి శరీరంలో కొవ్వును పెంచుకోకుండా జాగ్రత్తలు పాటిస్తే పని చేయని వారు రోజు జాగింగ్‌కు అలవాటైతే మన ఆరోగ్యాలను గుండె పోటు నుండి కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్షణం పాటు తీరని ఎవరు బిజీలో వారు, పక్కవారిని పలకరించడం కాదు కదా కుటుంబ సభ్యులతో సరిగా కలిసి జీవించలేని ఈ బిజీ బిజీ టెన్షన్ జీవనాలలో మన ఆరోగ్యాలను కాపాడుకోవడం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని వైద్యులు అంటున్నారు. గత పది సంవత్సరాల క్రితం గుండె పోటు మృతులు అంతగా ఉండేవి కావని, ఈ నాలుగైదు సంవత్సరాల నుండి గుండె పోటులతో అధిక శాతం మృత్యువాత పడుతున్నారని వైద్యులు అంటున్నారు. కరోనాకు ముందు గుండెపోటుతో తక్కువ మంది మృతి చెందేవారని, కరోనా అనంతరం గుండెపోట్లతో మృతుల సంఖ్య పెరిగిందని, సర్వత్రా వైద్య విశ్లేషకులు, మేధావులు అంటున్నారు. అందుకే ఆరోగ్యం కాపాడుకోవడంలో అధిక శ్రద్ధ వహిస్తూ జాగ్రత్తగా జీవనాలు గడపాలని, గుండెపోటు పట్ల తస్మాత్ జాగ్రత్త అని కొందరు హెచ్చరిస్తున్నారు.
-నింగి సాయిలు
97012 08014