మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్నాయి. తాజాగా రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా, యూనిట్ సభ్యులు నెక్స్ షెడ్యూల్ కోసం శ్రీలంకకు బయలుదేరారు. శనివారం నుంచి ప్రారంభమయ్యే ఈ షెడ్యూల్‌లో అందమైన ప్రదేశాల్లో రామ్ చరణ్, – జాన్వీ కపూర్‌లపై ఒక అద్భుతమైన పాటను చిత్రీకరించనున్నారు.ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్. రహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బుచ్చిబాబు సానా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్‌ను పూర్తిగా కొత్త లుక్‌లో, ఇప్పటివరకూ ఎన్నడూ చూడని గెటప్‌లతో చూపిస్తున్నారు. రామ్ చరణ్ ఈ పాత్ర కోసం పూర్తిగా మేకోవర్స్ అవుతూ అద్భుతమైన స్టంట్స్ చేయబోతున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా, జగపతి బాబు, దివ్యేందు శర్మా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ‘పెద్ది’ చిత్రం 2026 మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.