న్యూఢిల్లీ : దేశ వ్యాప్త ఎ న్నికల ఓటర్ల జాబితాల స వరణ(సర్)ను ఎన్నికల సంఘం వచ్చే వారం నుం చి ఆరంభించనుంది. వ చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలతో పా టు పది నుంచి 15 రాష్ట్రాలలో తొలుత సర్ ప్రక్రియ చేపడుతారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు శనివారం తెలిపాయి. వచ్చే ఏడాది తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ రాష్ట్రాలలో ఓటర్ల జాబితాల సవరణ కీలకం కానుంది. ఇక ఎప్పటి నుంచి ఈ సవరణల ప్రక్రియ ఆరంభమవుతుందనేది ఎన్నికల సంఘం నవంబర్ తొలివారంలో ప్రకటిస్తారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే లేదా జరగాల్సిన చోట్ల సర్ నిర్వహించడం లేదు. మిగిలిన రాష్ట్రాలలోసర్ ఆ తరువాతి దశల్లో చేపడుతారు.
ఓటర్ల జాబితా సవరణల ద్వారా ఎన్నికలు పారదర్శకతతో నిర్వహించేందుకు దారి ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నికల సంఘం రెండు సార్లు రాష్ట్రాల ఇసిలతో సమావేశం జరిపింది. క్షేత్రస్థాయిలో సాధకబాధకాలను తెలుసుకుంది. సర్ విషయంలో వివాదాలకు తావులేకుండా రాజకీయ పార్టీలు, సంస్థలు , పౌరులు తమకు నిర్మాణాత్మక సహకారం అందించాలని ఎన్నికల సంఘం పిలుపు నిచ్చిం ది. ఇంతకు ముందటి ఓటర్ల జాబితాల తుది ఫైళ్లను ఎన్నికల సంఘం ఇప్పటికే వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. వీటి ప్రాతిపదికననే ఓటర్ల జాబితాలో సవరణకు వీలేర్పడుతుందని అధికారులు తెలిపారు. బీహార్ సర్ ప్రక్రియపై రాజకీయ పార్టీల విమర్శల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇప్పుడు ఎటువంటి వివాదాలకు తావులేకుం డా చూసుకునేందుకు సిద్ధం అయింది.