సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ జట్టు 23 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 124 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ట్రావిస్ హెడ్ 29 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో ప్రసిద్ధ్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మిచెల్ మార్ష్ 41 పరుగులు చేసి అక్షర పటేల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. మాథ్యూ షార్ట్ 30 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో మ్యాట్ రెన్షా (17), అలెక్స్ కారే(01) బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు ఈ సిరీస్‌లో 2-0తో ముందంజలో ఉంది.