బాలీవుడ్ ప్రముఖ నటుడు సతీష్ రవీలాల్ షా కన్నుమూశారు. ఆయన వయస్సు 74 పంవత్సరాలు. హాస్యంతో పాటు సామాజిక అంశాలపై తీసిన పలు సినిమాలలో ఆయన నటనలో జీవించారు. జానే బి దోయారో, మై హూ నా , సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ వంటి సినిమాలలో హాస్యం పండించి , చిత్రసీమ పై చెదరని ముద్రవేశారు. ముంబైలోని బంద్రా ఈస్ట్‌లోని ఆయన స్వగృహంలో శనివారం మధ్యాహ్నం కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారని ఆయన వ్యక్తిగత సహాయకుడు రమేష్ కడతల తెలిపారు. 1951 జూన్ 25వ తేదీన జన్మించిన షా భారతీయ సినిమా టీవీ రంగాలలో పేరు తెచ్చుకున్నారు. ఆయన నటనావృత్తిలో దశాబ్దాల అనుభవం గడించారు. మాలామాల్, హీరాపేరి, కల్ నా హో నా హో వంటి హిట్ సినిమాలలో నటించారు. ఫిల్మ్ ఇనిస్టూట్ (ఎఫ్‌టిఐఐ) గ్రాడ్యుయెట్ అయిన సతీష్ షాకు రంగస్థలంపై కూడా పట్టుంది. జానే బీదో యారో చిత్రంలో లంచగొండి మున్సిపల్ కమిషనర్ పాత్ర ఆయనకు మైలురాయి అయింది. ఈ సినిమాలో నసీరుద్దిన్ షా, ఓం పురి, పంకజ్ కపూర్ వంటి ప్రముఖ నటులతో కలిసి ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. డిజైనర్ మధుషాతో ఆయన వివాహం అయింది. వీరికి ఓ కుమారై , కూతురు ఉన్నారు. పలువురు సినీ ప్రముఖులు సతీష్ షా మృతి పట్ల సంతాపం తెలిపారు.