సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ జట్టు 46.4 ఓవర్లలో 236 పరుగులు చేసి ఆలౌటయ్యారు. భారత జట్టు ముందు 237 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఉంచింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లలలో మ్యాట్ రెన్షా ఒక్కరే హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. ఆసీస్ బ్యాట్స్ మెన్లు మ్యాట్ రెన్షా (56), మిచెల్ మార్ష్ (41), ట్రావిస్ హెడ్ (29), మాథ్యూ షార్ట్ (30), అలెక్స్ కారే(24), కూపర్ కనోలీ(23), నాథన్ ఎలిస్(16), మిచెల్ ఓవెన్(01), మిచెల్ స్టార్క్(02), జోష్ హజిల్ వుడ్(0), అడమ్ జంపా(02 నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో హర్షిత్ రానా నాలుగు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు, సిరాజ్, కులదీప్, ప్రసిద్ధి కృష్ణ, అక్షర పటేల్ తలో ఒక వికెట్ తీశారు.