హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ఆధిపత్య ధోరణి భరించలేక రాజీనామా చేస్తున్నారని మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. కొందరు ఐఎఎస్ లు రాజీనామా చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐఎఎస్ సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ నిజాయితీ గల అధికారి అని ప్రజలందరికీ తెలుసు అని రిజ్వీని మానసికంగా వేధించడంతోనే రాజీనామా చేశారని తెలియజేశారు. రాజకీయ నాయకులకు ఐఎఎస్ రిజ్వీ రాజీనామా చెంపపెట్టు అని చెప్పారు. సిఎం, మంత్రులు లూటీ చేస్తున్నారని విమర్శించారు. సిఎం పై మంత్రి కుమార్తె ఆరోపణలు చేశారని నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు.