చెన్నై : కరూర్‌లో టివీకే పార్టీ ర్యాలీలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను సోమవారం పార్టీ అధ్యక్షుడు విజయ్ కలుసుకోనున్నారు. చెన్నై సమీపంలోని రిసార్టులో వారిని పరామర్శించనున్నారు. దీనికోసం టీవీకే పార్టీ రిసార్టులో 50 గదులను బుక్‌చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించడానికి ప్రభుత్వం అనుమతించకపోవడంతో ఈ ఏర్పాట్లు చేసినట్టు పార్టీ పేర్కొంది. అక్కడకు వెళ్లడానికి బస్ బుక్ చేశారని, మాలో చాలామంది వెళ్తున్నామని బాధిత కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మీడియాకు వెల్లడించారు.