మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలు, బిసి రిజర్వేషన్‌లకు సంబంధించి వచ్చేనెల 03వ తేదీన హైకోర్టులో కేసు ఉ న్నందున ఆ రోజు కోర్టు ఇచ్చే తీర్పుకు అనుగుణంగా 07వ తేదీన మరోసారి కేబినెట్ భేటీలో చర్చించి స్థానిక సంస్థల ఎన్నికలపై ని ర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. గురువారం జరిగిన తెలంగాణ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎన్నికల్లో పోటీచేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను సైతం ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. సిఎం రేవంత్ అధ్యక్షతన గురువారం కేబినెట్ సమావేశం జరిగింది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ పంచాయతీ రా జ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని తొలగించాలని కేబినెట్ ఆ మోదించింది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 21(3) తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ఫైల్ పై పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి సీతక్క, సిఎం రేవంత్ ఇప్పటికే సం తకం చేశారు. దానికి గురువారం కేబినెట్ ఆమోదం తెలపడంతో ఆ ఫైల్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపనున్నారు.
గవర్నర్ సం తకం తర్వాత ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు. కేబినెట్ భేటీ అ నంతరం మంత్రులతో సిఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యా రు. రాజకీయ అంశాల గురించి వారితో ఆయన చర్చించారు. స్థా ని క సంస్థల ఎన్నికలతో పాటు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంత్రులు వ్యవహారించాల్సిన తీరు గురించి సిఎం రేవంత్‌రెడ్డి వారికి దిశానిర్ధేశం చేసినట్టుగా తెలిసింది.
1994 తర్వాత మూడో సంతానం కలిగితే
1994లో అప్పటి ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం 1994 తర్వాత మూడో సంతానం కలిగితే వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు. ఎపి నుంచి తెలంగాణ విడిపోయాక 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిన కెసిఆర్ ప్రభుత్వం ఇద్దరు పిల్లల నిబంధన గురించి పట్టించుకోలేదు.
పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21(3) ప్రకారం
పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21(3) ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారు అనర్హులు. అయితే, ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై అవగాహన పెరిగినందున పాత నిబంధనను మార్చి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలు కోరాయి. 2024 డిసెంబర్ 20న జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ ప్రతిపాదన రాగా మంత్రి వర్గం ఆమోదించలేదు. తాజాగా, గురువారం జరిగిన కేబినెట్ భేటీలో పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయడానికి ఆమోదం తెలిపింది.
ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయాలని నిర్ణయం: మంత్రి పొంగులేటి
ఈ సందర్భంగా కేబినెట్ భేటీకి సంబంధించిన వివరాలను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని తొలగించాలని కేబినెట్ నిర్ణయించడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.
శ్రీశైలం నుంచి నల్గొండకు టన్నెల్…
నల్గొండలోని ఫ్లోరైడ్ బాధితులను బిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి పొంగులేటి ఆరోపించారు. అందులో భాగంగా శ్రీశైలం నుంచి నల్గొండ గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలని గతంలో నిర్ణయించామన్నారు. నల్గొండకు నీళ్లు ఇచ్చేందుకు 44 కి.మీల టన్నెల్‌ను నిర్మించాలని గతంలో ఆమోదించామని, అందులో భాగంగానే శ్రీశైలం నుంచి నల్గొండకు తలపెట్టిన టన్నెల్‌ను పూర్తి చేయాలని ఈ కేబినెట్‌లో నిర్ణయించామని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రపంచంలోనే పొడవైన ఈ ఎస్‌ఎల్‌బిసి సొరంగం పనులను పునరుద్ధరించాలని, మిగిలిన సొరంగం పనులను ఆధునిక డ్రిల్లింగ్ నైపుణ్యంతో చేపట్టాలని కేబినేట్ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.
ఈ గ్రావిటీ ద్వారా 3.50 లక్షల ఎకరాలకు నీళ్లను అందించటంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించవచ్చని మంత్రివర్గం నిర్ణయించింది. అంచనా వ్యయంలో ఎలాంటి మార్పు లేకుండా మిగిలిన పనులు కూడా పూర్తి చేసేందుకు కాంట్రాక్టు ఏజెన్సీ ముందుకు వచ్చింది. అదే కాంట్రాక్టు కంపెనీకి సొరంగం తవ్వకం పూర్తి చేసే పనులు అప్పగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 44 కిలోమీటర్ల సొరంగంలో రెండు వైపుల నుంచి ఇప్పటి వరకు 35 కిలో మీటర్ల సొరంగం తవ్వకం పూర్తయింది. ఫిబ్రవరి 22వ తేదీన జరిగిన దురదృష్టకర ప్రమాదంతో పనులు ఆగిపోయాయి. మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వడానికి అటవీ, పర్యావరణ, వన్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని వాడాలని, 2028 జూన్ నాటికి ఎస్‌ఎల్‌బిసిని పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
రామగుండం ప్లాంట్‌ను డిస్‌మెంటల్ చేయాలని….
1,500 మెగావాట్ల బ్యాటరీ విద్యుత్ స్టోరేజీ ప్లాంట్‌కు ఆమోదం తెలిపినట్టు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. 52 ఏళ్ల క్రితం నాటి రామగుండం థర్మల్ స్టేషన్‌ను (ఆర్‌టిఎస్‌బి 62.5 మెగావాట్ల యూనిట్) కాలపరిమితి ముగియడంతో దానిని డిస్‌మెంటల్ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడున్న విద్యుత్ అవసరాలు, రాబోయే పదేళ్ల విద్యుత్ డిమాండ్ అంచనాలకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాళిక తయారు చేయాలని విద్యుత్ శాఖను కేబినెట్ ఆదేశించింది. అందుకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తికి అనుసరించాల్సిన వ్యూహాలను నివేదించాలని మంత్రివర్గం సూచించింది.
4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను త్వరితగతిన పూర్తి చేయాలి
4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను త్వరితగతిన పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ ఆస్పత్రుల్లో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎల్బీనగర్ టిమ్స్, సనత్ నగర్ టిమ్స్, అల్వాల్ టిమ్స్ నిర్మాణాలు ఉండగా అక్కడ జరిగే పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది