రిషబ్‌శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కాంతార: ఛాప్టర్ 1’. ఈ అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. హోంబలే బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించింది. 16వ శతాబ్ధం జరిగిన కథగా ఈ సినిమాను తెరకెక్కించారు. చాలా మంది ప్రముఖులు ఈ సినిమాను మెచ్చుకున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాను చూసి.. మెచ్చుకుంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
‘‘నిన్న రాత్రి కాంతార: ఛాప్టర్ 1 సినిమా చేశాను. ఎంతో అద్భుతమైన సినిమా. మూవీ చూస్తున్నంతసేపు ట్రాన్స్‌లోకి వెళ్లిపోయా. రచయితగా, డైరెక్టర్‌గా, యాక్ట్రర్‌గా రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో అని చెప్పాలి. రుక్మిణి, జయరామ్, గుల్షన్ దేవయ్యతో పాటు మిగతా నటీనటులంతా చక్కగా నటించారు. టెక్నికల్ టీమ్ పనితీరు అద్భుతంగా ఉంది. ముఖ్యంగా అజనీష్ సంగీతం, అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ, ధరణి ఆర్ట్ డైరెక్టన్, అరుణ్ రాజ్ స్టంట్స్ చాలా బాగున్నాయి. నిర్మాత విజయ్ కిరంగదూర్, హోంబులే బ్యానర్‌కి శుభాకాంక్షలు’’ అని బన్ని పేర్కొన్నారు.