ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ శ్రీను వైట్ల. కానీ, గత కొంతకాలంగా ఆయన హిట్‌లకు దూరమయ్యారు. ఎంతో నమ్మకంతో ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వం’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో ఆయన సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. ఇఫ్పుడు శ్రీను వైట్ల మరో మంచి స్క్రీప్ట్‌తో రెడీగా ఉన్నారని సమాచారం. తనదైన శైలీలో ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఆయన ప్రేక్షకులకు ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట.
ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎంతో ఇష్టమైన శర్వానంద్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారని.. ఇప్పటికే శ్రీను వైట్ల.. శర్వాకి కథ చెప్పగా.. ఆ కథ ఒకె అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని భోగట్టా. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారని.. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని టాక్. ప్రస్తుతం ‘భోగి’, ‘బైకర్’ సినిమాలతో శర్వానంద్ బిజీగా ఉన్నారు. మరోవైపు ఆయన హీరోగా నటించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా ‘నారి నారి నడుమ మురారి’ సినిమా సంక్రాంతి విడుదలకు రెడీ అవుతోంది.