అక్టోబర్ 20న సాయంత్రం భారతదేశం అంతటా దీపావళి వెలుగులు విరజిమ్ముతుండగా, ఆనందాల పండుగ మరో సారి పొగ కమ్ముకుంది. చాలా కాలంగా వేడుగలకు ప్రతీకగా నిలుస్తున్న టపాకాయలు, బాణాసంచా, ఆరోగ్యం, పర్యావరణం, ఎన్నికల అవకాశవాదంపై జాతీయ చర్చలలో కేంద్రాలుగా మారాయి. ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (ఎఒఐ) ప్రతిదినం ప్రమాదకర స్థాయిని దాటి హెచ్చుతోంది. సుప్రీం కోర్టు నిర్ణీత గంటల్లో పర్యావరణ హితమైన గ్రీన్ క్రాకర్లను అమ్మకాలను అనుమతించడం వల్ల నిబంధనలు అమలు క్లిష్టంగా మారింది. అసోంలో సంబరాలు లేవు. రాష్ట్రం విషాదంలో మునిగిపోయింది. గాయకుడు జుబీన్ గార్గ్ మృతికి ప్రజలు సామూహిక సంతాపం ప్రకటించడంతో ఈ ఏడాది దీపావళికి బాణాసంచా కాల్చరాదని ప్రతినబూనారు. ఈ పండుగ కేవలం టపాసులు కాల్చడానికే పరిమితం కాలేదు. మతపరమైన సానుకూలతకోసం ఉపయోగించుకునే రాజకీయాలు, దీర్ఘకాలిక మనుగడ కంటే స్వల్పకాలిక ఆర్థిక లాభాలకు కక్కుర్తిపడే వారి అంతరాలను బహిర్గతం చేసే యుద్ధభూమిగా మారింది.
ఢిల్లీలో విషపూరిత దీపావళి, బిజెపి పాలనకు సవాల్ ఢిల్లీ వాయు కాలుష్య సంక్షోభం ఏటా భయంకరమైన ఓ బెడద. శీతాకాలం దగ్గరపడేకొద్దీ కమ్మేసే పొగమంచు, పొరుగు రాష్ట్రాల నుంచి కాల్చే చెత్త, వ్యవసాయ వ్యర్థాలవల్ల వెలువడే పొగ, పారిశ్రామిక ఉద్గారాలు, వీటికితోడు బాణాసంచాల ద్వారా పెరిగే విషపూరిత మిశ్రమాలు వేలాదిమంది ఉసురును తీస్తోంది. ప్రతి ఏడాది దీపావళి సీజన్‌లో శ్వాసకోశ వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆస్పత్రుల నివేదికలు వెల్లడిస్తున్నాయి. సుప్రీంకోర్టు అక్టోబర్ 2025లో ఇచ్చిన ఆదేశం ప్రకారం దీపావళి నాడు సాయంత్రం 6-9 గంటల మధ్య కొన్ని ప్రదేశాల్లో రాత్రి -10 గంటల వరకూ పర్యావరణ అనుకూల (కాలుష్యం తగ్గించే) గ్రీన్ క్రాకర్లను మాత్రమే విక్రయించడానికి అనుమతి ఉంది.
జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్) వెలుపల పూర్తిగా విషేధాన్ని విధిస్తుంది. ఇది బాణాసంచాపై పూర్తి నిషేధం కాదు. జాగ్రత్తలతో కూడిన ఆదేశం. అమ్మకాలు అధికార అవుట్‌లెట్‌లకే పరిమితం చేశారు. బాణాసంచా కాల్చుకునే సమయాన్ని పరిమితం చేశారు. అమలు బాధ్యత ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులపై ఉంటుంది. దీనికి కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు మద్దతు ఇస్తుంది. అయినా, 2025 ఫిబ్రవరిలో రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన బిజెపి నేతృత్వంలోని పాలనా యంత్రాంగంపై పెద్ద బాధ్యతే ఉంది. 1998 తర్వాత ఢిల్లీలో బిజెపి తొలిసారి అధికార పగ్గాలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వంతో డబుల్ ఇంజన్ హామీతో ముందుకు వచ్చింది. కానీ, కాలుష్య నియంత్రణ చర్యలపై ఇప్పుడు విమర్శలను ఎదుర్కొంటోంది. జాతీయ ట్రాక్ రికార్డు తరచు ప్రజారోగ్యం కంటే, పారిశ్రామిక వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే విధానమే ఇప్పుడు సమస్య అయింది. గ్రీన్‌క్రాకర్స్‌కు సంబంధించి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసర్చ్ (సిఎస్‌ఐఆర్) సర్టిఫికేషన్ లేకపోవడం వ్యవస్థాగత వైఫల్యాన్ని వెల్లడిస్తోంది. ప్రతి బ్యాచ్‌ను ప్రమాణీకరించడానికి ప్రయోగశాల పరీక్షలు, క్షేత్రస్థాయిలో తనిఖీలు అవసరం.
కానీ, చాందీనీ చౌక్, సదర్ బజార్ అంతటా నకిలీవస్తువులను అమ్మకందార్లు విక్రయిస్తూ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఈ సవాల్ కేవలం లాజిస్టికల్ మాత్రమే కాదు. రాజకీయమైనది. కేంద్రం, రాష్ట్రస్థాయి లో బిజెపి పర్యావరణ విధానాలను దారుణంగా మారుస్తున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. హస్టియో అరండ్ వంటి జీవవైవిధ్యంగల కీలక ప్రాంతాలలో బొగ్గుగనుల తవ్వకాలకు అనుమతిలు ఇవ్వడం, థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన కాలుష్యానికి సంబంధించిన నిబంధనలను సడలించడం వరకు బిజెపి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో దశాబ్దికాలంగా వాతావరణం కన్నా, పారిశ్రామిక లాబీలకే ప్రాధాన్యత ఇస్తోంది.హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో బిజెపియే అధికారంలో ఉన్నా పంటలను తగులబెట్టడాన్ని అరికట్టడంలో వైఫల్యం, బిజెపి పాలిత ఢిల్లీకి సంకటంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ చేపట్టిన కాలుష్య నియంత్రణ చర్యలను హిందూ వ్యతిరేకతగా చిత్రీకరించిన బిజెపి, ఇప్పుడు ఇరకాటంలోపడింది.
పార్టీ ఈ మధ్య చేస్తున్న ప్రచారాలు, దాని పర్యవేక్షణలో వెలవెలబోతున్నాయి. దీపావళికి సంబంధించి దాని నినాదాలకు, దాని చర్యలకు మధ్య వైవిధ్యం తేటతెల్లమవుతోంది. ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రతిపక్షానికే పరిమితం కావడంతో రాజధానిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పొగమంచు మధ్య మెరుగైన పాలన అందించాల్సిన బాధ్యత బిజెపిపైనే ఉంది. ఈ దీపావళి రోజున, ఆనంద్ విహార్, ద్వారక వంటి కీలక ప్రాంతాల్లో అర్ధరాత్రికి వాయు నాణ్యత స్థాయి 400 ప్లస్‌కు దిగజారిందని అంచనా. నిజమైన పరీక్ష ఇప్పుడే ఎదురయింది. రాజధానిలో గస్తీకి తగినంతమంది పోలీసులను నియమించారా. సిపిసిబి రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ కాలుష్యనియమాలు ఉల్లంఘించేవారిని సమర్థంగా గుర్తించాయా. నిర్దిష్ట సమయంలోనే బాణాసంచా కాల్చాలన్న ప్రచారం, కాలుష్యం వల్ల అనర్థాలను తెలుపుతూ, స్కూళ్లలో చేపట్టిన కార్యక్రమాలు, లేజర్ షోల వంటివి చాలా కీలకం. అయినా, పంజాబ్, హర్యానాలలో పంట వ్యర్థాల తగులపెట్టడం వల్ల అంతర్రాష్ట్ర కాలుష్య నియంత్రణకు కేంద్రం గట్టిచర్యలు తీసుకోని పక్షంలో కేంద్రం వైఫల్యం తీవ్ర పరిణామాకు దారితీస్తుంది.
అసోం రాజకీయ ప్రతిఘటనల మధ్య జుబీన్ గార్గ్ సంతాపం ఢిల్లీ రాజధానిలో ఊపిరి సలపని పరిస్థితి ఉంటే, ఈశాన్య రాష్ట్రాల బలహీన పర్యావరణ వ్యవస్థలు దీపావళి వేడుకలను భిన్నంగా కోరుకుంటున్నాయి. బ్రహ్మపుత్ర వరద మైదానాలు, తూర్పు హిమాలయాలతో కూడిన అసోం ముప్పులోఉన్న జీవవైవిధ్యానికి ప్రతీక. అసోంలో గాలి నాణ్యత ఢిల్లీ కన్నా చాలా మెరుగ్గా, శుభ్రంగా ఉన్నా, బయోమాస్ ధ్వంసం, బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దును వచ్చే పొగమంచుకు ఇబ్బందుల పాలవుతున్నది. ఈ ప్రాంతంలో సమాజాలు దీపావళిని బిహు సంప్రదాయంలో కలుపుతూ బాణాసంచా కంటే నూనె దీపాలు మట్టి దీపాలతోనే పండుగ జరుపుకునేందుకు ఇష్టపడతాయి. పర్యావరణ పరిరక్షణలను దెబ్బతీస్తూ ఎన్నికల ప్రయోజనంకోసం హిందూ పండుగలను ఉపయోగించుకోవడం దారుణం. దీపావళి, చీకటిపై వెలుగుకు ప్రతీకగా నిలవడంతో పార్టీ సాం సృ్కతిక జాతీయవాదంలో ఓ ఆసరాగా మారింది. ఢిల్లీలో ఆప్ అధికారంలోఉన్నప్పుడు చేపట్టిన కాలుష్య నియంత్రణ చర్యలను హిందూ వ్యతిరేక చర్యగా బిజెపి ప్రచారం చేసింది.
అసోంలో బిశ్వశర్మ టపాకాయల అమ్మకందారుల పై చూపుతున్న ప్రేమ కాలుష్యాన్ని పెంచి పోషించే పారిశ్రామికవేత్తలతో ఆయన అనుబంధాన్ని చూపుతున్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా సాగుతున్న వ్యూహం. బిజెపి అధికారంలో ఉన్న దశాబ్దకాలంలో పారిశ్రామిక ఉద్గారాల అనుమతులు 30% పెరిగాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ డేటా చెబుతోంది. బిజెపికి పౌరుల ఆరోగ్యంపట్ల, పర్యావరణ సమతుల్యతపట్ల శ్రద్ధ లేదని, గిరిజనులు వ్యతిరేకిస్తున్నా,ఒడిశాలో నియమగిరి కొండలలో బాక్సైట్ గనుల తవ్వకాలకు ఈ మధ్య అనుమతి ఇవ్వడం ద్వారా రుజువైంది. మతపరమైన దోపిడీ లోతుగా సాగుతోంది. నిషేధాలను హిందూ విశ్వాసాలపై దాడిగా చిత్రీకరించడం ద్వారా బిజెపి, ఉత్తరప్రదేశ్, అసోం వంటి రాష్ట్రాలలో ఓట్లను సంపాదించడానికి పడుతున్న ఆందోళనను చూపుతోంది.
భారతదేశం వైవిధ్యభరితమైన దేశం. హిందువులే కాదు, జైనులు, సిక్కులు, బౌద్ధులు కూడా పంచుకునే దీపావళి సార్వత్రిక ఆనందాన్ని విషపూరితం చేయకూడదు ప్రజా సంతాపాన్ని కించపరచకూడదు. ఈ దీపావళి పరివర్తనపరమైన మార్పునుకోరుతోంది. అందరి సహకారం వల్లనే ఢిల్లీలో పర్యావరణపరమైనవిజయం ఆధారపడిఉంది. బాణాసంచా రియల్ టైమ్ పేలుళ్లను గుర్తించేందుకు ఆప్ 11 జిల్లాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పర్యవేక్షించే డ్రోన్‌లను మోహరించాలని కోరుతోంది. కానీ కేంద్రం పంటల వ్యర్థాల ధ్వంసం అరికట్టేందుకు ఉపగ్రహ ట్రాకింగ్, రైతులకు సబ్సిడీలతో రాజధాని వ్యాప్తంగా గడ్డినిషేధాలను అమలు చేస్తున్నది. పౌరులసహకారం అన్నిటికన్నా అవసరం. ఉల్లంఘనలను గుర్తించేందుకు మొబైల్ యాప్‌లు, కాలుష్యనియంత్రణపై అవగాహన కల్పించేందుకు పాఠశాల డ్రైవ్‌లు, లేజర్‌షోలు వంటి పర్యావరణ ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం అవసరం.
– గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్)
– రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు