హైదరాబాద్: బస్సుల్లో భద్రతాచర్యలపై నిర్ణయాలు తీసుకుంటామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కర్నూలు బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణ చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని, అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. తెలంగాణ, ఎపి, కర్ణాటక మంత్రుల సమావేశం నిర్వహిస్తామని, బస్సుల ఓవర్ స్పీడ్ నియంత్రణకు కమిటీ వేస్తామని అన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ మధ్య అనారోగ్య పోటీ ఉందని, దాన్ని నివారిస్తామని పూర్తి వివరాలు వచ్చాక ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందజేస్తామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.