వాతావరణ శాఖ రాష్ట్రానికి మర అలర్ట్ ఇచ్చింది. ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న తూర్పు, మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో శుక్రవారం మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అక్టోబర్ 27 వరకు మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడి తుఫానుగా మారే సూచనలు ఉన్నట్లు అంచనా వేసింది. తుఫాను దక్షిణ కోస్తా, తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉందని, దీంతో మరో నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. శనివారం రాష్ట్రంలోని ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.