హన్మకొండ నయీంనగర్ స్కూల్‌లో వరుస మరణాలు
గురువారం ‘బ్రెయిన్‌డెడ్’తో నాల్గో తరగతి విద్యార్థి మృతి
బాలుడి మరణంపై తల్లిదండ్రుల అనుమానాలు
న్యాయం చేయాలని పాఠశాల ఎదుట ఆందోళన
గత నెలలోనే హార్ట్ ఎటాక్‌తో ఓ విద్యార్థి మృతి
మనతెలంగాణ/హన్మకొండ: హనుమకొండ నయీంనగర్‌లో గల తేజస్వి ప్రైవేట్ స్కూల్‌లో ఒ క విద్యార్థి గురువారం అనుమానాస్పద రీతిలో మ రణించాడు. ఈ పాఠశాలలో విద్యార్థుల వరుస మ రణాలు తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నెల రోజుల కిందట ఒక విద్యార్థి ఆడుకుంటూ కింద పడి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోవడం తో భారీ ఎత్తున బంధువుల వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనను మరువక ముందే ఇదే పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న బానోతు సు జిత్ ప్రేమ్ అనే విద్యార్థి క్లాస్ రూమ్‌లోనే కింద ప డ్డాడు. స్కూల్ యాజమాన్యం ఆ చిన్నారిని హాస్పిటల్‌కి తీసుకెళ్లింది.
అయితే, ఆ విద్యార్థిని పరీక్షించిన డాక్టర్లు బ్రెయిన్ డెడ్ కావడంతో చనిపోయాడని నిర్ధారించారు. ఈ విషయం తెలిసి బాధిత వి ద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ గేట్ ముందు ఆందోళన చేపట్టారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు జురుగకుండా పోలీసు లు స్కూల్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.