తిరుపతి: సరదగా ఈత కోసం నదిలోకి దిగిన యువకులు అందులో పడి గల్లంతయ్యారు. నలుగురు యువకులు గల్లంతు కాగా.. ఒకరి మృతదేహం లభించింది. తిరుపతి రూరల్ మండల పరిధిలో ఈ విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అగ్రహారానికి చెందిన ఏడుగురు యువకులు శుక్రవారం వేదాంతపురం సమీపంలోని స్వర్ణముఖి నదిలోకి ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ ప్రకాశ్(17), చిన్న(15), తేజు(19), బాలు(16) నదిలో గల్లంతయ్యారు. స్థానికులు గమనించి విష్ణు, మణిరత్నం, కృష్ణను కాపాడారు. గల్లంతైన వారిలో బాలు మృతదేహం లభ్యమైంది. మిగిలిన ముగ్గురి కరోసం గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలింపు చేపట్టారు.