సింగం సినిమాలాగా ఎస్సై ప్రవర్తన
ఇందల్వాయి: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామములో గ్రామ సమస్యల మీద చర్చ జరుగుతుంటే ఇందల్వాయి ఎస్సై ఘటన స్థలానికి వచ్చి విడిసి సభ్యులు, గ్రామ పెద్దల పైన తన ఇష్టారాజ్యంగా దుర్భాషలాడారు. విడిసి చైర్మన్ అని చుడాకుండా ఎవడిచ్చాడు మీకు అధికారం అంటూ గ్రామ అభివృద్ధి కమిటీపై విరుచుక పడ్డాడు. గ్రామస్తులపై ఎస్సై ప్రవర్తించిన ఘటన ఇందల్వాయి గ్రామ శివారులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. అసలు విడిసి అంటే ఏంట్రా నువ్వేమైనా కలెక్టర్ వా నీకు ఎవడు ఇచ్చాడు అధికారం నువ్వెవడివి అక్కడ ఉన్న ప్రజలను గు… గు.. పగులగొడతా అంటూ తన ఇష్టానుసారంగా బూతుపురాణం మాట్లాడారు. విడిసి సభ్యుల పైన తన ప్రతాపాన్ని బూతుపురాణంతో చూపించాడు. యూనిఫాం అండ చూసుకొని ఇలా ప్రవర్తించడం బాగుండదని విడిసి సభ్యులు అంతా కలిసి చెప్పిన వినకుండా తన ఇష్టానుసారంగా వారిపై బూతు పురాణం మొదలు పెట్టాడు. వెంటనే ఇందల్వా ఎస్సై విడిసి కమిటీకి క్షమాపణ చెప్పాలని చెప్పకపోతే జిల్లా సిపికి కంప్లైంట్ చేస్తామని తెలిపారు.