పాకిస్థాన్ అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొనడంతో అక్టోబర్ 11 నుంచి ఇరుదేశాల సరిహద్దులను మూసివేశారు. దీంతో పాక్ అఫ్గాన్ ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది. బోర్డర్ మూసివేత వల్ల ఇరుదేశా ల్లో పండ్లు, కూరగాయలు , ఖనిజాలు, ఔషధాలు , గోధుమలు, బియ్యం, చక్కెర , మాంసం , పాల ఉత్పత్తులు వం టి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఘర్షణలకు ముందుతో పోలిస్తే పాక్‌లో టమాటా ధరలు ఐదు రెట్లు పెరిగినట్టు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కిలో టమాటాల ధర 600 పాకిస్థానీ రూపాయలు ఉన్నట్టు తెలుస్తోంది. అఫ్గాన్ నుంచి అధికంగా దిగుమతి చేసుకునే ఆపిల్ ధరలు కూడా భారీగా పెరిగినట్టు సమాచారం.
సాధారణంగా పాక్ అఫ్గాన్ సరిహ ద్దు నుంచి ఏటా ఇరుదేశాల మధ్య 2.3 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని , ఇరుదేశాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో బోర్డర్లలో వాణిజ్య, రవాణా సదుపాయాలు పూర్తిగా నిలిపివేశామని, కాబూల్ లోని పాక్‌అఫ్గాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతి ఖాన్ జాన్ అలోకోజాయ్ వెల్లడించారు. దీనివల్ల రోజుకు ఇరువైపులా దాదాపు 1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 8 కోట్లు ) నష్టం వాటిల్లుతుందన్నారు. అఫ్గాన్ నుంచి పాక్‌కు సరఫరా చేసే దాదాపు 5 కంటైనర్ల కూరగాయలు పాడైనట్టు తెలిపారు. సరిహద్దుకు ఇరువైపులా దాదాపు 5 వేల కంటైనర్లు నిలిచిపోయాయని, పాకిస్థాన్ లోని ప్రధాన టోర్ఖామ్ సరిహద్దు క్రాసింగ్ వద్ద ఉన్న ఓ అధికారి పేర్కొన్నట్టు స్థానిక మీడి యా వర్గాలు వెల్లడించాయి.