కర్నూలు: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు శివారులోని చిన్నటేకూర్ సమీపంలో సమీపంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బైక్‌ను బస్సు ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే మరో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన కావేరి ట్రావెల్స్ బస్సును పక్కకు తీస్తుండగా క్రేన్ బోల్తా పడింది. ఈ ఘటనలో క్రేన్ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.