తమిళ స్టార్ హీరో ధనుష్‌కు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలకు ఇక్కడ కూడా హౌస్‌ఫుల్ బోర్డులు పెడతారు. ఇటీవలే ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తన వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి తండ్రి వారసత్వంగా ఇడ్లీ దుకాణం నడిపే వ్యక్తిగా ధనుష్ ఈ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా అంతగా సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో సినిమాను వీలైనంత త్వరగా సినిమాను ఒటిటిలోకి తీసుకువస్తున్నారు. అక్టోబర్ 29వ తేదీన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఒటిటి సంస్థ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఇక ఈ సినిమాను ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. నిత్యమేనన్, శాలినీ పాండే హీరోయిన్లుగా నటించగా.. రాజ్‌కిరణ్, సత్య రాజ్ కీలక పాత్రలు పోషించారు.