త్రినాధ్ కఠారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇట్లు మీ ఎదవ. తెలుగు అమ్మాయి సాహితీ అవాంచ హీరోయిన్ గా నటిస్తున్నారు. వెయేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ కు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా నుంచి ‘ఉన్నట్ట మరి లేనట్ట’ సాంగ్‌ను రిలీజ్ చేశారు హీరో శ్రీకాంత్. ఆర్పీ పట్నాయక్ ఈ సాంగ్ ని అద్భుతమైన మెలోడీగా కంపోజ్ చేశారు. పూర్ణాచారి ఆకట్టుకునే లిరిక్స్ రాశారు. ఎస్‌పి చరణ్, శృతిక సముద్రాల గాత్రాలు మైమరపించాయి. ఈ సాంగ్‌కి చాలా మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ “ఇట్లు మీ ఎదవ టైటిల్ చాలా కొత్తగా వుంది. ఉన్నట్ట మరి లేనట్ట సాంగ్ చాలా అద్భుతంగా వుంది. ఆర్పీ పట్నాయక్ ఎంతో బాగా కంపోజ్ చేశారు. త్రినాధ్, సాహితీ జోడి చాలా బావుంది. ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.