విశాఖపట్నం: నగరంలో దొంగనోట్ల తయారీ కలకలం రేపింది. స్థానిక ఎంవిపి కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగనోట్లు తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మధ్యప్రదేశ్‌కు చెందిన శ్రీరామ్ అలియాస్ గుప్తాగా గుర్తించారు. నిందితుడి నుంచి ల్యాప్‌టాప్, ప్రింటర్, నోట్లు తయారు చేసే పేపర్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుప్తా ఎంవిపి కాలనీలో 6 నెలల క్రితం అద్దెకు దిగినట్లు తెలిసింది. అతడిపై ఇండోర్, ముంబైలో కేసులు ఉన్నాయి. దొంగనోట్ల తయారీ కేసులో ఐదేళ్ల క్రితం జైలుకు వెళ్లి వచ్చినట్లు విచారణలో వెల్లడైంది.