అడిలైడ్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో అడిలైడ్ ఓవెల్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో సిరీస్‌ని 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. భారత బ్యాటింగ్‌లో రోహిత్ 73, శ్రేయస్ 61, అక్షర్ 44, హర్షిత్ 24 పరుగులు చేశారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా నిలకడగా బ్యాటింగ్ చేసింది. 46.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. ఆసీస్ బ్యాటింగ్‌లో షార్ట్ 74, కన్నోల్లి 61, ఓవెన్ 36, రెన్షా 30 పరుగులు చేశారు. దీంతో ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి.. సిరీస్‌ని దక్కించుకుంది. మూడో వన్డే అక్టోబర్ 25న సిడ్నీలో జరగనుంది.