సిఎం, డిప్యూటీ సిఎంతో మంత్రి జూపల్లి భేటీ
రిజ్వీ వ్యవహారశైలిపై ఫిర్యాదులు
సిఎంను కలిసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ
రాజకీయ వేడి సృష్టించిన వివాదం
రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తుందని విమర్శలు
సిఎం అల్లుడు, మంత్రి కొడుకు పంచాయితీలో రిజ్వీ బలి అయ్యారని ఆరోపణ
రాష్ట్రంలో రేవంతుద్దీన్ సర్కార్: బిజెపి రాష్ట్ర చీఫ్ రామచందర్‌రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. గురువారం ప్రజా భవన్‌లో భట్టిని కలిసిన జూపల్లి రిజ్వీపై తాను రాసిన లేఖ, తాజా పరిణామాల గురించి వివరించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తమ పరిధి దాటి వ్యవహారించారని మంత్రిగా తన ఆదేశాలను ఎక్సైజ్ కమిషనర్ కూడా పట్టించుకోలేదని భట్టికి వివరించినట్లుగా సమాచారం. సీనియర్ ఐఏఎస్ సయ్యద్‌అలీ ముర్తజా రిజ్వీ వర్సెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు లేఖ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
వ్య క్తిగత కారణాలు చూపుతూ రిజ్వీ విఆర్‌ఎస్ తీసుకోగా, రిజ్వీ అవినీతిపరుడైన అధికారి అని ఆయనపై విచారణ చేపట్టాలని సిఎస్‌కు జూపల్లి రా సిన లేఖ బహిర్గతం కావడంతో ప్రతిపక్షాలు ఈ సంఘటనను అస్త్రంగా మలుచుకోవడంతో ప్రభు త్వం ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే పనిలో పడింది. ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సిఎం రేవంత్‌ను కూడా కలిసి తన శాఖలో జరిగిన పరిణామాల గురించి ఆయనకు వివరించినట్టుగా తె లిసింది. అయితే, సిఎస్‌కు రాసిన లేఖ, దానిలో అంశాల గురించి మంత్రి జూపల్లి పేర్కొన్నట్టుగా సమాచారం. ఎక్సైజ్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీలు తన ఆదేశాలను తరువాయి 8లో