మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీ సుకుంది. రాష్ట్రంలోని అన్ని రవాణా చెక్ పోస్టులను మూసివేస్తూ ఆ దేశాలు జారీ చేసింది. అక్టోబర్ 22వ తేదీన సాయంత్రం 5 గం టల లోపు మూసివేయాలని ఆ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశా రు. రెండు నెలల క్రితం ఈ చెక్ పోస్టులను మూసివేయాలని నిర్ణ యం తీసుకున్నా వాటిని కొనసాగించడంపై సిఎం రేవంత్ సీరియస్ అ య్యారు. వెంటనే రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్‌ఫోర్ట్ చెక్ పోస్టులను మూ సివేయాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించడంతో రవాణా శాఖ కమిషనర్ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. దీంతోపాటు తాను జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే అమల్లోకి తీసుకు రావాలని రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్లు, జిల్లా ట్రాన్స్‌ఫోర్ట్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చెక్ పోస్టుల దగ్గర ఉన్న బోర్డులు, బారికేడ్లు, సిగ్నేజ్ తొలగించాలని కమిషనర్ ఆదేశించారు. సిబ్బందిని ఇతర శాఖలకు తిరిగి నియమించాలని చెక్ పోస్టుల దగ్గర ఎవరూ ఉండొద్దని ఆయన సూచించారు. చెక్ పోస్టుల దగ్గర వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని, రికార్డులు, ఫర్నీచర్, పరికరాలు వెంటనే జిల్లా ట్రాన్స్‌ఫోర్ట్ కార్యాలయానికి తరలించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక, పరిపాలనా రికార్డులను సమన్వయం చేసి భద్రపరచాలని కమిషనర్ సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన ప్రకటనలు ఇవ్వాలని, చెక్ పోస్టుల మూసివేతపై సమగ్ర నివేదికను అక్టోబర్ 22 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని రవాణాశాఖ కమిషనర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.’
ఏసిబి నివేదిక ఆధారంగా…..
కాగా, గత శనివారం అర్ధరాత్రి (18వ తేదీన) రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసిబి అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరం భీం జిల్లాల్లోని చెక్ పోస్టులపై ఏసిబి అధికారులు దాడులు నిర్వహించడంతో పాటు అక్కడ జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వానికి ఏసిబి నివేదిక అందించింది. ఈ నేపథ్యంలోనే బుధవారం రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టులను మూసివేయాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
చెక్‌పోస్టుల స్థానంలో ఏఎన్‌పిఆర్ అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులోకి….
ఈ చెక్‌పోస్టుల ఎత్తివేత అనంతరం ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ఏఎన్‌పిఆర్) అడ్వాన్స్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ అడ్వాన్సుస్డ్ కెమెరా సిస్టమ్ ఖైరతాబాద్‌లోని ప్రధాన రవాణా శాఖ ఆఫీస్‌కు అనుసంధానమై ఉంటుంది. దీంతో రవాణా శాఖలో పారదర్శకత స్పష్టంగా కనిపించనుంది. అయితే, ప్రస్తుతం చెక్‌పోస్టుల వద్ద డ్యూటీ చేస్తున్న సిబ్బందికి కొత్త బాధ్యతలు అప్పగించనున్నారు. ఏ వాహనం అయినా కెమెరా కళ్లు గప్పి ఇతర మార్గాల ద్వారా రాష్ట్రంలోకి వస్తే వాటిని జాతీయ రహదారులపై అడ్డుకొని చర్యలు తీసుకునేందుకు వీలుగా మొబైల్ స్క్వాడ్‌లను కూడా రవాణా శాఖ రంగంలోకి దింపనుంది. ఈ వ్యవస్థపై ముందుగా గూడ్స్ ట్రాన్స్‌ఫోర్ట్ చేసే వాహన యజమానుల అసోసియేషన్‌కు ఆర్టీఏ అధికారులు అవగాహన కల్పించనున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్యాసింజర్ వెహికల్స్‌తో పాటు సరకు రవాణా వాహనాల పర్మిట్లు, మిగిలిన అనుమతులన్నీ ముందే ఆన్‌లైన్‌లో పొందేలా రాష్ట్ర రవాణా శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతుల్లేకుండా లేదా నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్రంలోకి ప్రవేశిస్తే వెంటనే గుర్తించి చర్యలు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు 15 చెక్ పోస్టులు దగ్గర విధుల్లో ఉన్న సుమారు 70 మంది ఎంవిఐలు, ఏఎంవిఐలు, ఇతర సిబ్బందిని ప్రస్తుతం రవాణా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించనున్నారు.