టీమిండియా ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే లో పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా ఉండటంతో భారత బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. ఆసీస్ స్పిన్నర్లను బరిలోకి దింపిన సరే భారీ షాట్లకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలో 135 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పొయింది. రెండో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మహాఫ్ సెంచరీ చేశాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 59వ అర్థ శతకం . ఈ మ్యాచ్ లో 74 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీలో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అయితే కుదురుగా ఆడుతున్న రోహిత్ శర్(73) మిచెల్ స్టార్క్ వేసిన ఫార్ట్ బంతిని ఆడబోయి హేజిల్ వుడ్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో శ్రేయాస్ తో 118 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం టీమిండియా 30 ఓవర్లకు 3 వికెట్లు కోల్పొయి 137 పరుగులు చేసింది. క్రీజులో ఉన్న శ్రేయాస్ అయ్యార్(51; 67 బంతుల్లో) హఫ్ సెంచరీ చేశాడు. కెరీర్ లో శ్రేయాస్ కి 23వ అర్థశతకం