అమరావతి: తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నెపలి వద్ద హైవేపై బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రైవేటు బస్సులో 35 మంది పెళ్లి బృందం నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు గుర్తించి ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే కిందకు దిగడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాదం కారణంగా బస్సు దగ్ధమైంది. స్థానికులు సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.