సిద్దూ జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో వచ్చిన ‘తెలుసు కదా ‘ సినిమా సక్సెస్ మీట్ లో నిర్మాతలు బండ్ల గణేష్ , ఎస్ కెఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడాతూ.. తాన్ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించానని,తెలుసు కదా సినిమా బాగుందన్నారు. ఈ సినిమాలో సిద్దూ జొన్నలగడ్డ అద్భుతంగా నటించారని, రవితేజ స్థానంలో సిద్దూ చూస్తున్నట్లు ఉందన్నారు. ‘తెలుసు కదా’ లాంటి సినిమాని నిర్మించాలంటే చాలా దైర్యం కావాలని, ఈ విషయంలో విశ్వప్రసాద్ ను అభినందించాలన్నారు. నా విషయానికి వస్తే టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి బ్రేక్ తీసుకున్నాను. అంతే కానీ ఫ్లాఫ్ లు వల్ల కాదు.. త్వరలోనే సెంకడ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తానన్నారు .